

సత్యం వార్త / నంద్యాల జిల్లా క్రైమ్ / ఫిబ్రవరి 26:
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి.జావళి ఐపీఎస్ సూచనలతో నంద్యాల పట్టణ కేంద్రంలోని ఎన్జీఓ కాలనీ నందు గల గురురాఘవేంద్ర మహిళల వసతిగృహం నందు ‘మహిళా భద్రత’ పై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ‘మహిళా భద్రత’ కు సంబంధించి వసతి గృహంలో సమస్యలపై చర్చించడంతో పాటు ప్రవేశ నిష్క్రమణ మార్గాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు వాటి పర్యవేక్షణ మరియు పరిసర ప్రాంతాలలో లైటింగ్ మరియు మహిళల భద్రత,ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది.
సైబర్ క్రైమ్, సోషల్ మీడియా దుర్వినియోగం, మరియు ఆన్లైన్ భద్రత విషయాలపై వారికి విస్తృతమైన అవగాహన కల్పించారు. మొబైల్, సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చే ప్రమాదాలను గుర్తించటం, అనుమానాస్పద లింకులు లేదా అనుచిత సందేశాలు వచ్చినప్పుడు వెంటనే పోలీస్ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.
అనంతరం క్రింది ముఖ్యమైన టోల్ ఫ్రీ నంబర్ల గురించి వివరించడం జరిగింది.
డయల్ 100/112 (అత్యవసర సహాయం)
*చైల్డ్ లైన్ 1098 (పిల్లల రక్షణ)
మహిళ వేధింపులు 1091
సైబర్ నేరాల టోల్ ఫ్రీ 1930
మాదకద్రవ్యాల నియంత్రణ 1972 .
