

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 16 :
ప్రముఖ శైవక్షేత్రం లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అతిథి వసతి గృహ నిర్మాణమునకు రూ” 2 లక్షల 11వేల 116/- లు ఆదివారం భక్తులు విరాళంగా సమర్పించినట్లు ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. బనగానపల్లె పట్టణం మంగళవరం వీధీకి చెందిన అయిత చిన్న నాగరాజు లక్ష్మీ సరస్వతి ల కుమారుడు సురేంద్రబాబు లావణ్య కుటుంబ సభ్యులు 1లక్ష 11వేల 116/- లు, అదేవిధంగా నంద్యాల పట్టణం సంజీవ నగర్ కు చెందిన మద్దాల యుగంధర్ ఉమా దంపతుల కుమారుడు కుమార్తె గోవింద తులసీలు 1లక్ష విరాళంగా సమర్పించారు. వీరికి ఆలయ మర్యాదలతో శ్రీ స్వామివారికి అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి శేష వస్త్రములు, పూలమాలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటమును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నారాయణస్వామి, సురేష్ శర్మ, గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు, దాతల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
