

సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / ఫిబ్రవరి 13 :
ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు శుక్రవారం నిర్వహించిన టెంకాయల అంగడి గుత్త బహిరంగ వేలము వల్ల రూ.18,35,000/- లు రాబడి వచ్చినట్లు ఆలయ ఈవో యం.రామకృష్ణ తెలిపారు. వేలములో 6 మంది సభ్యులు ఒక్కొక్క లక్ష రూపాయలు డిపాజిట్లు చెల్లించగా, నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఏ.వీరారెడ్డి 18,35000/- హెచ్చు పాట పాడి దక్కించుకున్నారు. గత సంవత్సరం 15,50,000/- పోగా గతం కన్న నేడు 2.85 లక్షలు ఆదాయం వచ్చిందని, అదేవిధంగా పూల అంగడి వేలంలో 5 లక్షల 10 వేలు రాగా, గత సంవత్సరం 4 లక్షల 77 వేలు పోగా 33 వేలు ఆదాయం వచ్చిందని, గాజులు, పటముల అంగడి వల్ల 70,500/- రాగా గత సంవత్సరం 69,500/- వచ్చిందని వీటివల్ల ఒక వెయ్యి రూపాయలు మాత్రం ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. మూడు వేలముల వల్ల గత సంవత్సరం కన్నా 3 లక్షల 19 వేలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ వేలము నంద్యాల డివిజనల్ దేవాదాయశాఖ తనిఖీ అధికారి పి.హరిచంద్రారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి, బీరం శివరామిరెడ్డి, బాణా శ్రీనివాస రెడ్డి, ప్రధాన అర్చకులు సురేష్ శర్మ, పోలీసులు సిబ్బంది మరియు వేలం పాటదారులు పాల్గొన్నారు.
