కేసీ కెనాల్ కు సాగునీరు విడుదల చేయంచిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / ఫిబ్రవరి 23 :
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ ద్వారా సోమవారం సాగునీరు విడుదల చేయించారు.
ముచ్చుమర్రిలో గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్ట సందర్బంగా శుక్రవారం కేసీ కెనాల్ ఆయకట్టు రైతలు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికీ రెండు తడులు నీరు పెడితే పంట చేతికి వస్తుందని, నీరు పెట్టకపోతే పంట రాక ఎండిపోయి తీవ్రంగా నష్టపోతామని విన్నపం చేశారు. వెంటనే రైతుల సమస్య ను నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి దృష్టికీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ కేసీ కెనాల్ అధికారుల ద్వారా రైతుల పంటల వివరాలు సేకరించి రైతుల సమస్య అర్థం చేసుకున్న జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సోమవారం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ఒక పంపు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా ఒక పంపు నుంచి కేసి కెనాల్ కు సాగునీరు విడుదల చేశారు. నీళ్లు లేక కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతుందన్న విషయం తెలుసుకొని సకాలంలో స్పందించి నీటిని విడుదల చేయించిన నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరికి, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి లకు పగిడ్యాల, జూపాడుబంగ్లా మండలం కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

24-02-2026 / E-PAPER – satyamvaarthatelugudaily.com

Scroll to Top