



సిబ్బంది అందరూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి
వృత్తి నైపుణ్యం పెంచుకొని చట్టపరంగా విధులు నిర్వహించాలి
- జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపిఎస్
సత్యం వార్త / నంద్యాల క్రైమ్ / ఫిబ్రవరి 04 :
నంద్యాల జిల్లా సాయుధ పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన “మొబిలైజేషన్ ” ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఐపిఎస్ జిల్లా సాయుద బలగాలనుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం పెరేడ్ కమాండర్ బాబు కవాతు పరిశీలన కొరకు ఆహ్వానించగా, ఎస్పీ కవాతులో ఉన్న బలగాలను పరిశీలించి తిరిగి వేదిక వద్దక చేరుకోవడం జరిగింది.జిల్లా ఎస్పీ అనుమతితో సాయుద బలగాలు కవాతు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ కార్యాక్రమంలో పాల్గొన్న కానిస్టేబుల్ నుండి ఆఫీసర్ అందరినీ జిల్లా ఎస్పీ అబినందించారు.మొబలైజేషన్ కార్యక్రమం అనేది ఒక రీఫ్రెష్మెంట్ కోర్స్ లాంటిదని మీదైనందిన విధులలో మెరుగుపరుచుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.సమాజంలో,చట్ట పరిదిలో జరుగుచున్న మార్పులు శాంతిభద్రతలో కొత్తగా తలెత్తే సమస్యలపట్ల అవగాహన కలిగి ఉండాలని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలి.
పోలీస్ ఉద్యోగం అనేది ఒక ప్రత్యేకమైనదని అంతేకాక ప్రమాదంతో కూడుకున్నదని విధులు నిర్వహించేటప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తుంటారు కావున జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు.
మీరు నిర్వహించే విధులలో అనగా ఎస్కార్ట్ డ్యూటీ, గార్డ్ డ్యూటీ, పికెట్ డ్యూటీ,బందోబస్తు విధులు, P.S O విధులు, మాబ్ కంట్రోల్ ఇలా ఎలాంటి విధులు నిర్వహించిన చట్టానికిలోబడి జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే అది మీ ఉద్యోగాన్ని మరియు జీవితాన్ని ప్రమాదంలోకి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.
మీరందరూ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలని మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మీకుటుంబాన్ని మీవ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ విధులు నిర్వహించాలన్నారు.
ఈ మొబిలైజేషన్ లో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. సాయుద పోలీసు బలగాలు,బి.డి టిమ్, ప్రిజనర్స్ ఎస్కార్ట్, స్పెషల్ పార్టీ,P.S.Oలు, డ్రైవర్స్, తదితర సిబ్బంది తమకు కేటాయించిన విధుల్లో నైపుణ్యాన్ని పలు మెళకువలు అదికారుల ద్వారా నేర్చుకోవడం జరిగింది.
పోలీసు సిబ్బంది సంక్షేమంలో జిల్లా పోలీసు శాఖ అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని,వృత్తి పరంగా ఏదైనా సమస్య ఉంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చునని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఎ ఆర్ డి.ఎస్.పి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్లు మల్లికార్జున గుప్తా, సూర్య మౌళి ,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మంజునాథ్, సురేష్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
