ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో  నిర్వహించిన టెన్త్ క్లాస్ మోడల్ టెస్ట్ విజేతలకు బహుమతులు

సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 09 :

ఎస్ఎఫ్ఐ ఫిబ్రవరి నెల లో నిర్వహించిన ప్రజ్ఞా వికాస్ పరీక్ష లో నంద్యాల టౌన్ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానంలో వచ్చిన విద్యార్థులకు ఈరోజు బహుమతులు అందజేయడం జరిగింది.  ప్రథమ బహుమతి బి.మహా తేజస్విని  (శ్రీ బాలాజీ విద్యా మందిర్ స్కూల్) ద్వితీయ బహుమతి  డి.శ్రీనిధి రెడ్డి (శ్రీ చైతన్య స్కూల్), తృతీయ బహుమతి ఎస్.సఫియా (శ్రీ సంకల్ప స్కూల్) గెలుచుకున్న విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.నాయక్ మరియు శ్రీ బాలాజీ విద్యా మందిర్,శ్రీ చైతన్య,శ్రీ సంకల్ప  స్కూల్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు.

విద్యార్థులతో మాట్లాడుతూ మేము చదువుకునేటప్పుడు ఏడో తరగతికి కూడా పబ్లిక్ పరీక్ష ఉండేదని ఇప్పుడు అది పోయి కేవలం పదో తరగతి మాత్రమే జరుగుతుందని అన్నారు అప్పట్లో బాగా కష్టపడి చదువుకునే వాళ్లమని కానీ ఇప్పుడు విద్యార్థులు మొబైల్ ఫోన్స్ కు, సోషల్ మీడియాకు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ పక్కనపెట్టి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని బాగా చదువుకుంటేనే ఈ సమాజంలో నీకంటూ ఒక స్థాయి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలానే పదవ తరగతి పరీక్షలకు ముందు విద్యార్థుల్లో భయం పోగొట్టడం కోసం ఈ టెన్త్ క్లాస్ మోడల్ టెస్ట్ పరీక్ష విద్యార్థులకు ఉపయోగపడుతుందని చదివే చదువులో రాసే పరీక్షలు మెలకువలు తెలుస్తాయని విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు టౌన్ అధ్యక్షులు శివకుమార్ నాయుకులు సాయికుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top