ఎన్ఎండి ఫయాజ్ చేతుల మీదుగా బోర్వెల్ ప్రారంభం

సత్యం వార్త / నంద్యాల / ఫిబ్రవరి 20 :

నంద్యాల పట్టణం 38వ వార్డ్ – ఎస్ ఆర్ బి సి రోడ్డులో ఉన్న హెచ్ఐవి పరివర్తన లైఫ్ సెంటర్‌కు శాశ్వత నీటి సౌకర్యం అందించేందుకు ఏర్పాటు చేసిన బోర్వెల్‌ను రాష్ట్ర తెలుగుదేశం యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ విశేషంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ“ప్రజల సంక్షేమమే మా లక్ష్యం. ముఖ్యంగా ఇలాంటి సేవా సంస్థలకు అవసరమైన నీటి సదుపాయాన్ని తక్షణమే అందించడం టిడిపి బాధ్యత” అని తెలిపారు.  ప్రిన్సిపాల్ అబ్రహం లింకన్ మాట్లాడుతూ ఈ బోర్వెల్ సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళినా కాలేదని ఎన్ఎండి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లిన నెల సమయంలోనే మా సమస్య పరిష్కారమైంది అని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పాల్గొని బోర్వెల్ ప్రారంభాన్ని అభినందించారు. ఎం ఆర్ రెడ్డి మాజీ కౌన్సిలర్, టిడిపి సీనియర్ నాయకులు మిద్దె చిన్న హుసేని, ప్రిన్సిపాల్ అబ్రహం లింకన్, బండి సాలమ్మ, 38వ వార్డ్ టిడిపి ఇన్‌ఛార్జి దేరెడ్డి శివనాగిరెడ్డి, సుంకయ్య, ఇతర టిడిపి కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు. ప్రజల అభినందనలు బోర్వెల్ ప్రారంభంతో లైఫ్ సెంటర్‌లోని వందలాది మందికి శుద్ధమైన నీటి సదుపాయం లభించబోతుండడంతో స్థానికులు ఎన్ఎండి ఫయాజ్ ని అభినందించారు.

Scroll to Top