


సత్యం వార్త / నంద్యాల జిల్లా బ్యూరో / మార్చి 25 :
నంద్యాల మండలం కానాల గ్రామ పంచాయతీ పరిధిలోని హైస్కూల్ కొట్టాల గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామ ప్రజలు, ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శిల్పా రవి ఆలయంలోని ఆంజనేయ స్వామి వారికి మరియు నూతనంగా ప్రతిష్టించిన ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకకల్యాణం కోరుతూ నిర్వహించిన ఈ హోమాల్లో ఆయన పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వరరెడ్డి, వైస్ ఎంపీపీ రంగారావుతో పాటు పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తుల రాకతో కానాల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
