
సత్యం వార్త / నంద్యాల జిల్లా ప్రతినిధి / మార్చి 14 :
గోస్పాడు మండలం, సాంబవరం గ్రామంలో వెలసియున్న శ్రీ అంకాలమ్మ తల్లి తిరుణాల మహోత్సవ ఆహ్వాన పత్రికను నంద్యాల మంత్రి క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి సాంబవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు శనివారం అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని గ్రామంలో శ్రీ అంకాలమ్మ తల్లి తిరుణాల మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని. పండుగ రోజున ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన “ఎద్దుల బల ప్రదర్శన” (బండ లాగుడు పోటీలను) ప్రారంభించవలసిందిగా మంత్రి ఫరూక్ ని సాంబవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గోస్పాడు మండల కన్వీనర్ కాటంరెడ్డి తులసీశ్వర్ రెడ్డి , సాంబవరం గ్రామ మాజీ సర్పంచ్ జూపల్లి రామగోపాల్ రెడ్డి , టిడిపి నాయకులు జూపల్లి రామ భూపాల్ రెడ్డి ,జూపల్లి వెంకటరమణారెడ్డి , వాల్మీకి సంఘం సభ్యులు ఎస్ ఆదినారాయణ ,గోపవరం చంద్రుడు ,ఎం వెంకటయ్య చెన్నూరు నాగేంద్ర ,కొత్తపల్లి నాగలింగం ,కడియాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
